Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధునాతన పద్ధతులతో వ్యవసాయం చేయాలి
- రేడియో కిసాన్దివాస్ కార్యక్రమంలో వక్తలు
- ఆకాశవాణి ఆధ్వర్యంలో ఘనంగా రెడియో కిసాన్దివాస్
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులు సాగు చేస్తున్న పంటలతో పాటుగా అనుబంధ వ్యవసాయ పంటల సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని, వ్యవసాయంలో వస్తున్న అధునాతన సాగు పద్దతులతో వ్యవసాయం చేయాలని పలువురు వ్యవసాయ, ఉద్యనశాఖ అధికారులు రైతులకు సూచించారు. బుధవారం ఆకాశవాణి కొత్తగూడెం, రామవరంలోని రేడియో స్టేషన్లో రేడియో కిసాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ప్రోగాం హెడ్ ఎస్.రమేష్ సుంకసారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉద్యావన అధికారి జనుగు మరియన్న, గరిమెళ్ళపాడు ఉద్యాన వన అధికారి కె.కిరణ్ కుమార్, ఉద్యానవనశాఖ సూపరింటెండెంట్ ఎస్.విజరు కుమార్ అధికారులు హాజరై రైతులకు పలుసూచనలు, సలహాలు, పంటల అధిక గిగుబడికి తీసుకోవాల్సిన పద్దతులు, అధునాతన వ్యవసాయంతో రైతుకు కలిగే లాభాలు తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు పద్ధతులు, తేనెటీగల పెంపకం గురించి కూలంకుశంగా వివరించారు. రెడియో కిసాన్ దివాస్ సందర్భంగా అభ్యుదయ రైతులను, ఉద్యన, వ్యవసాయ అధికారులను కొత్తగూడెం రెడియో స్టేషన్ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతు గొట్టిపాటి వెంకటేశ్వరరావు, నాయకులగూడెం రైతు మండే వీరభద్రం, సంపతనగర్ రైతు గుంటి దుర్గబాబు, ఇల్లందు రైతు మోహన్‌రాజ్ నాయక్, ఆకాశవాణి రేడియో సిబ్బంది. బైరి శ్రీనివాసన్, కొలిపాక శంకరరావు, బొల్లవరపు ప్రసాద్, సాంకేతిక సిబ్బంది పి.ప్రభాకరరావు, పి.సుదర్శన్‌లు పాల్గొన్నారు.