Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ సభలో పలువురు వక్తలు
నవతెలంగాణ-చర్ల
యువత ప్రతి క్రీడలో ముందంజలో ఉండాలని సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సామజిత్ భగత్ అన్నారు. బుధవారం చర్ల మండల కేంద్రంలో ప్రముఖ ఇంజనీర్ కొర్సా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మక్క- సార్లమ్మ గ్రండ్ వాలీబాల్ టోర్నమెంట్ ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాస్తవానికి ఈ క్రీడల ప్రారంభ కార్యక్రమానికి చర్ల సీఐ బి.అశోక్ రావాల్సి ఉండగా విధి నిర్వహణలో అందుబాటులో లేకపోవడం వలన ముఖ్యు అతిథిగా సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సామజిత్ భగత్, ఇన్స్పెకటర్ బుద్దిరామ్ సింగ్ టోర్నమెంట్ ప్రాంభోత్సం చేయడం జరిగింది. అనంతరం వాలీ బాల్ క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. యువత ఈ టోర్నమెంటు సద్వినియోగం చేసుకోవాలని మంచి మార్గంలో నడవాలని చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకూడదని ఆయన సూచించారు. అదేవిధంగా కొర్సా వెంకటేశ్వరుకి నిర్వహకులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. కేవి ఉన్నత ఉ ద్యోగం చేస్తూ శ్రీడాకారులను ప్రోత్సహించడం అనేది చాలా మంచి ఆలోచన చేశారని కొనియాడారు. ఆటల వలన వలన నూతన పరిచయాలు ఏర్పడతాయని, ఉల్లాసాన్ని ఇస్తుందని చెప్పారు. బుధవారం నుండి చెర్ల, దుమ్ముగూడెం రెండు మండలాల స్థాయి వాలీ వాల్ గవర్నమెంట్ మూడు రోజులపాటు మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంక్ వెనుక నిర్వాహణ చేయడం జరుగుతుందని నిర్వహణ కమిటీ తెలిపింది. ఎంట్రీ ఫీజు 300 చెల్లించి క్రీడాకారులు తమ తమ జట్లను నమోదు చేసుకోవాలని వారు కోరారు బహుమతి దాత, కొర్స వెంకటేశ్వర్లు తోపాటు ఇంక కొంతమంది ఏవీఎస్పీ ఉపాధ్యాయులు కలరని తెలిపారు. సోయం కామరాజు. ఏటిఎ నాయకులు, సేవలం వీరాస్వామి, శ్వాముల రామారావు నిర్వాహకులు నూపా నాగేశ్వరావు, పాండ్రు హేమ సుందర్, సోంది మల్లు దొర మొడియం విజరు రామ్, సోయం శ్రీను, మట్టా లక్ష్మీనర్సు, చర్ల పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.