Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యెర్రా కామేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ-పాల్వంచ
సమసమాజ స్థాపన కోసం జనాభాలో 85 శాతానికి పైన ఉన్న బహుజనులు అందరూ ఐక్యం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ....బహుజనుల హక్కులను,స్వేచ్ఛను అగ్రవర్ణ పాలకులు కలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాలలోని పేదల అభ్యున్నతిని పాలకులు విస్మరిస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో బహుజనులంటేనే చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేస్తేనే సమసమజాన్ని నిర్మించుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం చింతలచెరువు కమల, మహంకాళీ స్వాతి, కనుమ సుశీల, ఎస్.కె మీరాబి, లాలారాం తదితరులు పార్టీలో చేరారు. వారికి కామేష్ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి రమణి, అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లిక, పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, కుమారి, మర్థమ్మ తదితరులు పాల్గొన్నారు.