Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవభారత్లో కోలాహలంగా ముగిసిన వార్షికోత్సవం
నవతెలంగాణ-పాల్వంచ
విద్యార్థి జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే సఫలీకృతమైన విజయాలు సాధించడం సులభమని జిల్లా ఎస్పీ వినీత్ అన్నారు. పట్టణం లోని నవభారత్ పబ్లిక్ స్కూల్ 43వ వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అట్టాసంగా ప్రారంభమైన ఈ వార్షికోత్సవ వేడుకలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్ తొలి రోజు ప్రారంభించగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎంబి శ్రీనివాస్ రెడ్డి పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రెండవ రోజు నవకల మహౌత్సవాన్ని బుధవారం జరిగిన కార్యక్రమానికి ఎస్పీ వినీత్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రతినిత్యం ఉద్యోగ బాధ్యతతో విరామం లేకుండా మాకు పాఠశాల చిన్నారులు ప్రతిభ పాటవాలు తనను ప్రేరణ కలిగించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిటీ జనరల్ మేనేజర్ వైవి శ్రీనివాసరావు, షీప్ అడ్మినిస్ట్రేటర్ సిఎస్ఆర్ శ్యాంసుందర్, ప్రధాన ఉపాధ్యాయులు జ్యోతి పాఠశాల విద్యా సమన్వయకర్త ఏ శ్రీదేవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.