Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్ హామీతో విరమణ
నవతెలంగాణ-ఇల్లందు
రాజీవ్‌నగర్ తండాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెవాసులు గత వారం రోజులుగా చేస్తున్న దీక్షలను పోలీసుల సూచనలు, తహశీల్దార్ హామీతో బుధవారం విరమించారు. చర్చలకు స్థానిక తహశీల్దార్ కృష్ణవేణి, ఇల్లందు పోలీసులు సయోధ్యకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ ఆయన సిబ్బందితో దీక్షల వద్దకు వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో భూ పోరాట నేతలు ఎమ్ఆర్ఓతో చర్చలు జరిపారు. ఇళ్లు వేసుకున్న వారందరూ తమ ఆధార్ కార్డులు ఇవ్వాలని వాటిని పరిశీలించి పై అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. తాగునీరు తదితర సమస్యలను ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లండని సూచించారు. అనంతరం దీక్ష శిబిరంలో నాయకులు అబ్దుల్ నబి మాట్లాడుతూ తహశీల్దార్ హామీతో దీక్షల విరమణ చేస్తున్నామని, హామీ నెరవేరకపోతే తిరిగి ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్, సుల్తాన, దారావత్ రాందాస్, వైకుంఠం, పాష, హుస్సేన్ వెంకన్న, సుధాకర్ కౌసల్య, ఖైరున్, మలేఖా సరిత, తదితరులు పాల్గొన్నారు.