Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు
నవ తెలంగాణ-బూర్గంపాడు
సారపాక, సుందరయ్య నగర్ లోగల ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పర్యటిస్తూ ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోవటం లేదని ఆయన అన్నారు. మంచి నీళ్లు సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు సరిగా లేవని, డ్రైనేజీ కాలువలు లేక వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మిషన్ భగీరథ పైపులైను సుందరయ్య నగరంలో అందరికీ సంపూర్ణంగా వేయలేదని ఆయన పేర్కొన్నారు. గ్రామపంచాయతీ అధికారు లకు అనేకసార్లు విన్నవించుకున్న పట్టించుకునే పరిస్థితి లేరని ఆయన అన్నారు. సిపిఎం ప్రజల తరఫున నిత్యం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నామని దానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చి ఉద్యమాలకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, ఎస్.కె అబిద, కనకం వెంకటేశ్వర్లు, ఎస్.డి. హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.