Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో రుణమాఫీ లక్ష వరకు వెంటనే చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొణిజర్ల
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగంకు భారీ కోత విధించిందని, దీని వల్ల ఎరువులు ధరలు విపరీతంగా పెరిగి రైతులకు భారం రెట్టింపు అవుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం చింతపల్లి ప్రసాద్ అధ్యక్షతన మండల పరిధిలోని సీద్దిక్ నగర్ గ్రామంలో జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ ఏభై వేల కోట్ల రూపాయల తగ్గించటం జరిగింది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు ఉన్న పేదలకు గృహ నిర్మాణంకు ఐదు లక్షల రూపాయలు అందించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మండల కార్యదర్శి చెరకుమల్లి కుటుంబరావు, జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, మండల కమిటీ సభ్యులు, కట్టా రాంబాబు, పుల్లూరి వెంకటేశ్వరరావు, కాటయ్య, హరిచంద్, చిన్న దానయ్య, కుమారి, సరోజినీ, సాంబయ్య, గోపయ్య, అజరు తదితరులు పాల్గొన్నారు.