Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీవో కార్యాలయం ఎదుట లబ్ధిదారుల ధర్నా
నవతెలంగాణ- కల్లూరు
కాంతంపేట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తీసిన లాటరీలో అవకతవకలు జరిగి అనర్హులకు ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట లబ్ధిదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఒకే కుటుంబంలో ఆరుగురికి ఇల్లు కేటాయించడం జరిగిందని, కల్లూరులో నివాసం ఉండని వారికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించబడ్డాయని, ఈ విధంగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తీసిన లాటరీని రద్దుచేసి అర్హులను గుర్తించి అంతవరకే లాటరీ తీయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె హౌమర్ బి, కుర్ర ఉమామహేశ్వరి, ఎస్ కే.జమీల, ఎస్.కె.కరిమున్, నాగమణి, రజియా సుల్తాన్, వెంకట నాగలక్ష్మి పాల్గొన్నారు.