Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
ఏఐసీసీ, పీసీసీ, సీఎల్పీ, డీసీసీ ఆదేశాలతో చండ్రుగొండ మండలంలోని వెంకట తండా గ్రామంలో దారం గోవిందరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షతన, టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర శుక్రవారం ప్రారంభించారు . ఈ కార్యక్రమం ఉద్దేశించి సున్నం నాగమణి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని కరపత్రం ద్వారా గడపగడపకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు, పోడు సాగుదారులకు హక్కు పత్రాలు, సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ధరణి పోర్టల్ రద్దు, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంమే భరిస్తుందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు, అన్ని పంటలను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. గడపగడపకు ప్రజలకు దగ్గరకు వెళ్లి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రామిశెట్టి వెంకటేశ్వర్లు, రెడ్డి పోగులు సురేష్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడుగు కృష్ణవేణి, మండల కాంగ్రెస్ నాయకులు వీరన్న, గూగులోత్ శంకర్ పాల్గొన్నారు.