Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర ముఖ్య మంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రామారావు ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరాన్ని కేటీపీఎస్ విద్యుత్ కళా భారతి ఆడిటోరియంలో శుక్రవారం కేటీపీస్ 7వ దశ, 5అండ్6 దశల చీఫ్ ఇంజనీర్లు పాలకుర్తి వెంకటేశ్వరరావు, మేక ప్రభాకరరావు చేతుల మీదిగా రిబ్బన్ కత్తిరించి రక్త దానంను ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంగణంలో మొక్కలను నాటి, కేక్‌ను కట్ చేసారు. కేటీపీయస్ ఇంజనీర్లు, కెమిస్ట్స్, కార్మికులు, ఆర్టిజన్స్, కాంట్రాక్టు కార్మికులు, కాలేజీ విద్యార్థులు పాల్గొని రక్త దానం చేసారు. ఏరియా హాస్పిటల్ భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచకు చెందిన వైద్యలు, సిబ్బంది పాల్గొని రక్తాన్ని సేకరించారు. వాటిని సిక్కి సెల్, తలసేమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కనక దుర్గ మల్లేశ్వరి, డివిజనల్ ఇంజనీర్/టెక్నికల్, అసిస్టెంట్ కమాండెంట్ సి.జంగయ్య, డాక్టర్. జీస్సార్ ట్రస్ట్ సభ్యులు అంజిబాబు, జోగారావు, (హెచ్-142) యూనియన్ నాయకులు వెంపటి వెంకటేశ్వర్లు, సత్య రాజ్ స్టీవెన్, షేక్ సయ్యద్, యం శివరాం, బి సుమన్, యం భాస్కర్, ఎర్రగడ్డ ప్రసాద్, చిన్న శ్రీను, నరేష్ తదితరులు పాల్గొన్నారు.