Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ రమణమూర్తి, సీఐ ఇంద్ర సేనారెడ్డి
నవతెలంగాణ - ఆళ్ళపల్లి
300 కేజీల గంజాయి పట్టుకున్నట్టు ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి, టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇరువురు మాట్లాడుతూ.. చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి కారులో గంజాయిని నునావత్ భరత్, సుమన్ అనే స్మగ్లర్లు ఆళ్ళపల్లి మండలానికి తీసుకొస్తున్న నేపథ్యంలో కొత్తగూడెంలోని లక్ష్మిదేవిపల్లి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక ఎస్సై రతీష్, అరుణ్‌లు సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో కారును స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు. స్మగ్లర్లలో భరత్ ను అదుపులో తీసుకోగా, మరో స్మగ్లర్ సుమన్ పరారైనట్లు వారు తెలిపారు. కారులో గంజాయి సుమారు 300 కిలోలు ఉందని, దాని విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వాహన తనిఖీలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ ఉపేందర్, శివకృష్ణ, శ్రీనివాస్ రావు, తదితరులు ఉన్నారు.