Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారేపల్లి : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆదేశాలతో కారేపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నుండి పోలీస్‌స్టేషన్ సెంటర్ మీదిగా మోటర్ సైకిల్ ర్యాలీ, ప్రదర్శనలు జరిపారు. ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ అధ్యక ్షప్రధాన కార్యదర్శులు పెద్దబోయిన ఉమాశంకర్, ఇస్లావత్ బన్సీలాల్, ఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ పాల్గొన్నారు.
ముదిగొండ : కేసీఆర్ జన్మదినం వేడుకలను ముదిగొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకట్ గౌడ్,నాయకులు మీగడ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
వైరాటౌన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం వద్ద నుండి పెద్ద ఎత్తున సుమారు 5000 బైకులతో భారీ జన సముహంతో వైరా రింగ్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు మదన్‌లాల్ బైక్ ర్యాలీకి స్వాగతం పలుకుతూ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైరా రింగ్ రోడ్డు వద్ద వేలాది మంది కార్యకర్తల సమక్షంలో భాణోత్ మదన్ లాల్ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్ అంటూ నినాదాలు చేశారు.
ఖమ్మంరూరల్ : సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను మండల పరిధిలోని పొన్నెకల్లులో భారాస నాయకులు శుక్రవారం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఎంపీపీ బెల్లం ఉమ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకుమిఠాయిలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో భారాస మండలాధ్యక్షుడు బెల్లం వేణు, సర్పంచ్ తాటికొండ సుదర్శన్ రావు, సూడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, ముత్యం కృష్ణారావు, నారపాటి రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : ఎర్రుపాలెం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ప్రజా ప్రతినిధులు, మండల నాయకులతో కలిసి కెసిఆ ర్ పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.అనంతరం మండల కేంద్రంలోని కరుణ వృద్ధాశ్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, యువజన అధ్యక్షులు కొండపాటి సాంబశివరావు, స్థానిక సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీ సభ్యులు మస్తాన్‌వలి పాల్గొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక త్రీ టౌన్ ప్రాంతంలోని 46వ డివిజన్ జూబ్లిపుర పార్కులో శుక్రవారం ఉదయం సీఎం కెసిఆర్ 69వ జన్మదిన సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి, ప్రసన్న కృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బొల్లెపల్లి విజరు, బాల్డె నాగేశ్వరరావు, తొగరు భాస్కర్, దేవర వెంకన్న, కనకం భద్రయ్య, కాల్వొడ్డు శ్రీని వాస్, కన్నం రమేష్, శనిగరం ఉప్పలయ్య, గొరిగె నాగులు, మీరా సాహెబ్ పాల్గొన్నారు,
ఖమ్మం కార్పొరేషన్ : నగర మేయర్ పునుకోల్లు నీరజ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ తన ఛాంబర్లో సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సూడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రచార కార్యదర్శి షేక్. షకీనా పాల్గొన్నారు.
వేంసూరు : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర నాయకులు జలీల్ ఖాన్, ఉపాధి హామీ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, పలువురు సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని మర్లపాడు సెంటర్లో కెసిఆర్ జన్మదిన వేడుకలను నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.