Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని మదర్ధెరిసా ఇంజినీరింగ్ కళాశాల 22వ వార్షికోత్సవ వేడుకను కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గత వారం రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను శుక్రవారంతో ముగించారు. ముగింపు వేడుకకు మహబూబ్‌నగర్ జేపీఎన్సీఈ కళాశాల ఫౌండర్ అండ్ ఛైర్మెన్ కేఎస్ రవికుమార్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ మాట్లాడుతూ కళాశాల స్థాపించిన ఈ 22 ఏండ్లలో కళాశాలలో చదివిన ఎందరో విద్యార్ధులు వివిధ రంగాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారన్నారు. కళాశాలలో ఉత్తమ ఫ్యాకల్టీచే బోధన, అత్యాధునిక ల్యాబ్‌ల నిర్వహణ, ప్రాక్టికల్ నాలెడ్జి పెంపొందించేందుకు వర్క్‌షాపుల ఏర్పాటు తదితర నిర్మాణాత్మక చర్యలతో కళాశాల విద్యార్ధులు తమ చివరి సంవత్సరంలోనే బహుళజాతీయ సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారన్నారు. కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ సేవామూర్తి మదర్ధెరిసా పేరుతో కళాశాలను స్థాపించడం అభినందనీయమన్నారు. విద్యార్ధులు ప్రణాళికాబద్ధంగా కోర్సును పూర్తి చేసి జీవితంలో త్వరగా స్థిరపడి తల్లిదండ్రులకు చేదోడుగా నిలవాలన్నారు. మనదేశానికి చెందిన అనేక మంది విద్యార్ధులు విదేశాలలోని ప్రముఖ బహుళజాతీయ సంస్థలలో కొలువులు సాధించి ఆదర్శంగా నిలిచారని, వారి పక్కన చోటు దక్కించుకునేందుకు అందరూ పోటీపడాలని కోరారు. ముఖ్యవక్తలు మాట్లాడుతూ కళాశాల విజయాలను ప్రస్తావించారు. అనంతరం గత వారం రోజులుగా నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల యాజమాన్యం ముఖ్యఅతిధి రవికుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, ఛైర్మెన్ కంచర్ల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కొత్తూరు ప్రభాకర్‌రావు, డైరెక్టర్ కందిమళ్ల కృష్ణారావు, ఫార్మసీ ప్రిన్సిపాల్ టి.సత్యనారాయణ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్వీఆర్ దీక్షితులు, అగ్రికల్చరల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.అజరు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకలు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.