Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న యాజమాన్యాలు
- అనుమతులు లేకుండా నడుస్తున్న బస్సులు
- సీట్ల కెపాసిటీకి మించి విద్యార్థులను ఎక్కిస్తున్న వైనం
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
నవతెలంగాణ - ఎర్రుపాలెం
నిబంధనలకు పాతర పెట్టి ప్రభుత్వ అనుమతులను, రవాణా శాఖ అనుమతులను తుంగలో తొక్కి ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్, ఫిట్నెస్, పర్మెంటు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర పన్నులు కట్టకుండా ఎగ్గొకొడుతూ అనుమతులు లేకుండా అడిగే వారే లేరని తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన పాఠశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నా జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మండల పరిధిలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. మీనవోలు గ్రామంలో శ్రీ భాస్కర మెమోరియల్, మండల కేంద్రమైన ఎర్రుపాలెంలో ప్రతిభ విద్యానికేతన్, బనిగండ్లపాడు గ్రామంలో వివేకానంద ఇంగ్లీష్ మీడియంతో పాటు మరో రెండు ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. శ్రీ సూర్య ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నిర్వహించ బడుతున్న శ్రీ భాస్కర మెమోరియల్ పాఠశాలకు చెందిన ఏపీ 20 టి సి 2415 నెంబర్‌కు సంబంధించిన బస్సు కు 2- 8- 2018 సంవత్సరంతో పర్మిట్ కాలం ముగిసినా పర్మెంటు కట్టలేదు. 2023 జనవరి నెలతో పొల్యూషన్ సమయం అయిపోయనా తీసుకోలేదు. అదే పాఠశాలకు చెందిన ఏపీ 28 టిడి 32 89 నెంబర్ గల బస్సుకు 1-9-2022తో ఇన్సూరెన్స్ అయిపోయింది. 6-12-2019తో పొల్యూషన్ అయి పోయింది, పర్మెంటు లేదు. అయినా బస్సు తిప్పుతూనే ఉన్నారు. అదే పాఠశాలకు చెందిన టీఎస్ 04 యుబి బస్సుకి 26-6-2021తో పర్మిట్ సమయం ముగిసింది. 19-1-2023తో పొల్యూషన్ అయి పోయింది. 17-9-2022తో ఇన్సూరెన్స్ టైం ముగిసింది. మండల కేంద్రమైన ఎర్రుపాలెం ప్రతిభ విద్యానికేతన్‌కు సంబంధించిన బస్సులు ఏపీ 20వి 8911 బస్సుకు 15-5-2020 సంవత్సరంతో ఫిట్నెస్ లేదు. 1-1- 2020 తో పొల్యూషన్ కాలం ముగిసింది. 26-6-2020 తో ఇన్సూరెన్స్ టైము ముగిసింది. అదే పాఠశాలకు చెందిన ఏపీ 20 టిబి 6974 నెంబర్ గల బస్సు 6-11-2022తో పర్మిట్ కాలం ముగిసింది. 12-1-2023తో పొల్యూషన్ అయిపోయింది. 14-10-2022తో ఇన్సూరెన్స్ కాలం చెల్లిపోయింది. బనిగండ్లపాడుకు చెందిన వివేకానంద ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన ఏపీ 28 టిడి 8333 బస్సుకు 31-1-2022తో టాక్స్ టైం అయిపోయింది. టాక్స్ కట్టాల్సి ఉండగా టాక్స్ కట్టకుండానే బస్సును తిప్పుతున్నారు. 15-5-2020తో ఫిట్నెస్ అయిపోయింది. 7-11-2019తో ఇన్సూరెన్స్ టైం ముగిసింది. 25-12-2019తో పొల్యూషన్ అయిపోయింది. అదే పాఠశాలకు సంబంధించిన టీఎస్ 15 యుబి 0069 బస్సుకు 10-11-2022తో ఇన్సూరెన్స్ ముగిసింది. 21-1-23తో పొల్యూషన్ సమయం ముగిసింది. పర్మిట్ కూడా కట్ట లేదు. ఈ రీతిగా నిర్వహించబడుతున్న ఈ బస్సులకు రవాణా శాఖ అనుమతులు లేకుండా తమ ఇష్టానుసారంగా బస్సులను నడుపుతున్నారు. అనుమతులు లేకుండా నిర్వహించ బడుతున్న బస్సులకు జరగరానిది ఏదైనా జరిగితే దీనికి ఎవరు బాధ్యతలు వహించుతారని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ బస్సుల పైన చర్యలు చేపట్టాలని కోరు తున్నారు. ఈనెల 17వ తారీకు నాడు మధిరలో నిర్వహించబడుతున్న నారాయణ విద్యాసంస్థకు సంబంధించిన బస్సులను వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి బస్సులను సీజ్ చేశారు. ఈ మండలంలో నిర్వహించ బడుతున్న విద్యాసంస్థల బస్సులు కూడా తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించ బడుతున్న బస్సులను సీజ్ చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా ర్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.