Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో మల్లన్నపాలెం, పమ్మి గ్రామాలకు చెందిన ఐదుగురు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు రూ.1,55,500 విలువైన చెక్కులు మంజూరు కాగా, ఆ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పందిరి అంజయ్య, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకల రామకృష్ణ, చిన్నపంగు శివ, రాయబారపు ఉపేందర్, పమ్మి గ్రామ ఉపసర్పంచ్ వడ్డే మాధవరావు, ఎంపీటీసీ మాజీ వడ్డే శ్రీనివాసరావు, పమ్మి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయబారపు శంకర్, మల్లన్నపాలెం గ్రామ మాజీ సర్పంచ్ కోలేటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.