Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ ధ్యేయం
- కేసీఆర్ జన్మదినాన ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేసిన సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
గూడులేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణ శివారులోని జలగం వెంగళరావు పార్కు ఎదురుగా రూ. 5.3కోట్లతో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎంపికైన 94 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సండ్ర వారివారి గృహ ప్రవేశాలను దగ్గరుండి చేయించారు. గృహ ప్రవేశాలు చేయిసక కుటుంబాలకు బట్టలు, దుప్పట్లు, వంటసామాగ్రిని అందజేశారు. అనంతరం జరిగిన సభలో సండ్ర మాట్లాడుతూ డబుల్ ఇండ్లు పొందిన కుటుంబాలు వాటిని అమ్ముకోవద్దని కోరారు. స్థానికంగా లేనివారికి ఇల్లు మంజూరై ఉంటే తక్షణమే దానిని రద్దుచేయాలన్నారు. కేవలం సత్తుపల్లి పట్టణంలో ఇండ్లు లేని పేదలకు మాత్రమే నిర్మించడం జరిగిందన్నారు. అనంతరం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, కమిషనర్ కోడూరు సుజాత, తహసీల్దారు శ్రీనివాసరావు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే రఫీ, కౌన్సిలర్లు నరుకుళ్ల మమతశ్రీనివాసరావు, గ్రాండ్ మౌలాలి, చాంద్‌పాషా, అమరవరపు విజయనిర్మలకృష్ణారావు, కంటె నాగలక్ష్మీ పాల్గొన్నారు.