Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి ఎద్దడిపై స్థానిక రైతులతో కలిసి సాగర్ కాల్వ పరిశీలన
నవతెలంగాణ - బోనకల్
మండలంలో ఎండిపోతున్న మొక్క జొన్న పంటను అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లునందిని శుక్రవారం పరిశీలిం చారు. మండల పరిధిలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోనీ నారాయ ణపురం, ఆళ్ళపాడు మైనర్ల కింద రైతులు అత్యధికంగా మొక్కజొన్నను సాగు చేశారు.ఓ వైపు మిరప పంట దెబ్బతిని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ఎంతో కొంత ప్రయాసపడి గంపెడు ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మాత్రం నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. పంటలను కాపాడుకునే పరిస్థితి లేక నిరాశా, నిస్పహలతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సాగర్ నీటి విడుదల సాఫీగా జరుగుతుందని భావించి మండల పరిధిలో పోయినసారి కంటే రెండింతలు విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు. ఆళ్లపాడు, నారాయణపురం మైనర్ల కింద పంటలు వేసిన రైతులు నీటి తడులు సక్రమంగా అందక ఎండిపోతున్న మొక్కజొన్న పంటలను మధిర శాసనసభ్యులు సిఎల్ఫీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క ఆళ్లపాడు గ్రామ రైతులతో కలిసి పంటలను పరిశీలించారు అనంతరం రైతులతో కలిసి సాగర కాలువను పరిశీలించారు. ఆళ్లపాడు, నారాయణపురం మైనర్ల పరిధిలో 1,367 క్యూసెక్కుల నీటిని వదలాల్సి ఉండగా కేవలం 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో సరిపడా నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆమె దష్టికి తీసుకెళ్లారు. ఆళ్లపాడు సాగర్ కాలువ వద్ద రాప్ లేకపోవడంతో సాగర్ నీరు చివర భూములకు వెళ్ళే పరిస్థితి లేదనీ, అధికారులు వాటిని కూడా నిర్మించి చివరి దశలో ఉన్న పంటకు సరిపడా నీళ్ళు వచ్చేలా కషి చేయాలని రైతులు ఆమెను కోరారు. రైతుల సమస్యను మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు ఆమె రైతులకు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, గోవిందపురం (ఏ) గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, ఆల్లపాడు గ్రామ శాఖ అధ్యక్షుడు బుంగ రాములు, బీసీ సెల్ అధ్యక్షుడు కందుల పాపారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్, మండల యువజన నాయకులు బుక్య బద్రు నాయక్, గ్రామంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.