Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూలిటిల్ ఫ్లవర్ పాఠశాల వార్షికోత్సవంలో డీఈవో
నవతెలంగాణ-వైరా
న్యూలిటిల్ ఫ్లవర్ పాఠశాలలో 8వ వార్షికోత్సవాన్ని జిల్లా విద్యాధికారి సోమ శేఖర శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించినవి. ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రదర్శించిన మానవత్వానికి సంబంధించిన అక్బర్ బీర్బల్ నాటిక, పరమానందయ్య శిష్యుల నాటిక, హాస్యాన్ని పంచుతూనే ఆలోచనను కల్గించినవి. స్మార్ట్ ఫోన్ వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటున్నాయో వివరణాత్మకంగా ప్రదర్శించారు.క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డా.పి. భూమేష్ రావు , డైరెక్టర్స్ డా. కాపా మురళీకృష్ణ, కుర్రా సుమన్, లగడపాటి ప్రభాకర్ మాట్లాడుతూ పాఠశాల స్థాపించిన మొదటి సంవత్సరం నుండి అనునిత్యం స్కూల్ అభివృద్ధికి సహకరించిన తలిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 2016న పురుడు పోసుకున్నదే ఈ న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల అన్నారు. స్థాపించిన రెండు సంవత్సరాలకే ఐఐటి, మెడికల్ వంటి ఫౌండేషన్స్ను పరిచయం చేయడానికి కేంద్రీయ విద్యా విధానానికి అనుమతిని పొంది వాటికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా విద్యాధికారి సోమ శేఖర శర్మ మాట్లాడుతూ వైరా పట్టణానికి దూరంగా కాలుష్య రహితంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ పాఠశాల చుట్టూ పచ్చని చెట్లతో హరిత పాఠశాలగా ఉందని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. వైరా ఎసిపి ఎంఎ రెహ్మాన్ మాట్లాడుతూ వైరాలో న్యూలిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉన్నతి గురించి చాలా విషయాలు గతంలో విన్నా నేడు ప్రత్యక్షంగా చూస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కె వెంకటేశ్వర్లు, కాలేజీ ప్రిన్సిపాల్ పి.భువన ప్రసాద్, ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఎ.ఓ నరసింహారావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.