Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని సిఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని నేరడ గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రాష్ట్రాల కబడ్డీ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అంతరించి పోతున్న గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని కబడ్డీ పోటీలను గ్రామీణ స్థాయిలో రెండు రాష్ట్రాల స్థాయిలో క్రమం తప్పకుండా ప్రతి ఏడాది నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా క్రీడా జెండాను ఆవిష్కరించి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపకులు దూసరి శ్రీ రాములు, గ్రామ సర్పంచ్ ఈశ్వరమ్మ, గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాల్రావు, యూత్ అధ్యక్షులు నేతాజీ, కాంగ్రెస్ నాయకులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.