Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్
సీపీఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ వేదగిరి శ్రీనివాసరావు 3వ వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదగిరి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోడపట్ల రవీందర్ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ నేడు దేశంలో రైతులు, కార్మికులు, కర్షకులకు పెద్ద ప్రమాదం పడవేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాల వలన పెద్ద ప్రమాదం ఏర్పడిందని, కార్మికుల మనుగడ కష్టంగా మారిందన్నారు. ఈ దేశంలో 70 శాతం ప్రజలు చెల్లిస్తున్న పన్నులు, ట్యాక్సులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు వచ్చే ఆదాయాన్ని బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతూ రైతులు, కార్మిక, కర్షకులకు రోడ్డున పడేసే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేయడం ద్వారా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని తిప్పి కొట్టాలని, ఇదే అమరజీవి యాదగిరి శ్రీనివాసరావుకు ఇచ్చే నిజమైన నివాళులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భుక్యా వీరభద్రం, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, పట్టణ నాయకులు చింతనిప్పు చలపతిరావు, మల్లెంపాటి రామారావు, బొంతు సమత, హరి వెంకటేశ్వరావు, అనుమోలు రామారావు, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, గుమ్మా నరసింహారావు, మల్లెంపాటి ప్రసాదరావు, తోట కృష్ణవేణి, వేల్పుల మైకేల్, వడ్లమూడి మధు తదితరులు పాల్గొన్నారు.