Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్డుకు 50 లక్షలు
- నేటి నుండి 24 వార్డుల్లో పర్యటన
- కొందరు కౌన్సిలర్లు వేరే రాష్ట్రంలో ఉండటం సరికాదు
- ప్రకటనలో ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
సీఎం కేసీఆర్ ఇల్లందు మున్సిపాలిటీకి రూ.25 కోట్లు ఎస్డిఎఫ్ నుండి మంత్రి కేటీఆర్ టీయుఎఫ్ఐడీసీ నుండి రూ.14.76 లక్షల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే హరిప్రియ క్యాంపు కార్యాలయం నుండి శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీ దేశంలో 18వ స్థానం సాధించిందని పేర్కొన్నారు. అభివృద్ధికి సహకరించిన కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి అజరుకు ధన్యవాదాలు తెలిపారు. గత నెలలో కౌన్సిలర్లు అందరిని పిలిచి ప్రతి వార్డులో రూ.50 లక్షలు పెట్టి ఏ ఏ అభివృద్ధి పనులు కావాలో లిస్టు ఇవ్వండని అడిగినట్లు పేర్కొన్నారు. తమ వార్డు అభివృద్ధి చేయవలసింది పోయి సొంత లాభం కోసం వేరే రాష్ట్రంలో ఉంటున్నారంటే ఎంత స్వార్థం అని పేర్కొన్నారు. పార్టీ బి ఫామ్ ఇచ్చి గెలిపించి కౌన్సిలర్లను చేస్తే వీళ్ళు చేస్తున్నటువంటి స్వార్థం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వీరి కోసం గత 15 రోజుల నుంచి ప్రజలు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
నేటి నుండి 24 వార్డుల్లో పర్యటన : ప్రజలు కోరిన అభివృద్ధి లిస్ట్ తయారీ
నేటి నుండి మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో పర్యటించనున్నారని తెలిపారు. సీఎం నుండి తెచ్చిన నిధులను అభివృద్ధిని ఆపుకోము కదా అన్నారు. కొంతమంది కౌన్సిలర్లు అందుబాటులో లేని కారణంగా 19, 20 తేదీన ప్రతి వార్డులో పర్యటించి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ప్రతి వార్డు నుండి రూ.50 లక్షలు వార్డు ప్రజల అభిప్రాయంతో అభివృద్ధి లిస్టును తయారు చేయనున్నట్లు తెలిపారు. త్వరత్వరగా అభివృద్ధి పనులు చేయుట కొరకు జరుగు పర్యటనలో అందరూ సహకరించి పాల్గొనాలని తెలిపారు.
19, 20 తేదీలలో వార్డులలో పర్యటించనున్న సమయములు
19వ తేదీన 1, 2 వార్డులలో ఉదయం 11 గంటలకు 3, 4 వార్డులలో మధ్యాహ్నం 12 గంటలకు, 5, 6 వార్డులలో మధ్యాహ్నం 1 గంటలకు, 2-3 గంటలకు భోజన సమయం, 7, 8 వార్డులలో సాయంత్రం 4 గంటలకు 9, 10 వార్డులలో సాయంత్రం 5 గంటలకు 11, 12 వార్డులలో సాయంత్రం 6 గంటలకు పర్యటిస్తారు. 20వ తేదీన 13, 14 వార్డులలో ఉదయం 10 గంటలకు 15, 16 వార్డులలో ఉదయం 11 గంటలకు 17, 18 వార్డులలో మధ్యాహ్నం 12 గంటలకు 19, 20 వార్డులలో మధ్యాహ్నం 1-00 గంటలకు అనంతరం 2 నుండి 3 గంటల వరకు భోజన విరామం, 21, 22 వార్డులలో సాయంత్రం 4 గంటలకు 23, 24 వార్డులలో సాయంత్రం 5 గంటలకు పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఇల్లందు మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, పార్టీ పట్టణ కమిటీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, యువజన నాయకులు, మైనార్టీ నాయకులు, మహిళా నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ అభిమానులు పాల్గొనవలసిందిగా ప్రకటనలో తెలిపారు.