Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తులసి స్ఫూర్తితో పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
- వర్ధంతి సభలో నాయకుల ఉద్ఘాటన
నవతెలంగాణ-భద్రాచలం
దేశంలో మతోన్మాద శక్తులను తరిమికొట్టడమే అమరజీవి కామ్రేడ్ బండారు తులసికి ఇచ్చే ఘన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, పార్టీ సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్ అన్నారు. పార్టీ మాజీ శాఖ సెక్రెటరీ అమరజీవి కామ్రేడ్ బండారు తులసి 6వ వర్ధంతి సభ నాదెళ్ళ లీలావతి అధ్యక్షతన జరిగింది. ముందుగా తులసి చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జె.రమేష్, సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్‌లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన ప్రజలను విభజించి పాలిస్తున్నారని ఇది దేశ సమైక్యతకు ప్రమాదం అని అన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అమలు పరుస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని అటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి మతోన్మాద శక్తులను తరిమి కొట్టాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.
భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త మొక్కవోని దీక్షతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, సీనియర్ నాయకులు బిబిజి తిలక్, జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకటరామారావు, పి.సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, యు.జ్యోతి, ఎస్.డి.ఫిరోజ్ ఖాన్, కుంజ శ్రీనివాస్, జి.లక్ష్మీకాంత్, కోరాడ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఏం వి ఎస్ నారాయణ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గౌతమి, శాఖ కార్యదర్శులు డి.రామకృష్ణ, గడ్డం నాగలక్ష్మి, మాధవి, రోజా, తులసి కుటుంబ సభ్యులు బండారు సరస్వతి బండారు సత్యనారాయణ, బండారు సూర్యప్రసాద్, బండారు అమ్మాజీ బండారు సుందరయ్య, బండారు మావో కుమార్ తదితరులు పాల్గొన్నారు.