Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు టీబీజీకేఎస్ విజ్ఞప్తి మేరకు ఎంసీ క్వార్టర్స్ పార్కింగ్ నిర్మాణం కోసం రూ.కోటి 47 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల వ్యక్తం చేసినట్లు ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మణుగూరు సింగరేణి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పీవీ కాలనీ ఏరియాలోని 35 ఎంసీ బ్లాక్స్ 490 క్వార్టర్స్‌కు పార్కింగ్ షెడ్ నిర్మాణం కోసం ఈ నిధులు విడుదల చేస్తూ సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏరియా నందు ఎంసీ బ్లాక్‌లకు పార్కింగ్ సౌకర్యం లేక ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అనేక అవస్ధలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ అసౌకర్యానికి గరి అవుతున్న విషయం పై మణుగూరు టీబీజీకేఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించి పలుమార్లు డైరెక్టర్ స్ధాయిలో సమస్యను పరిష్కరించి పార్కింగ్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రాల రూపంలో కోరిందన్నారు. నిధుల మంజూరుకు తోడ్పాటు అందించిన డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జి.వెంకటేశ్వర రెడ్డి, డైరెక్టర్ (పా) ఫైనాన్స్ బలరాంకి, డైరెక్టర్ ఆపరేషన్ యస్.వి.కే.శ్రీనివాస్, ఏరియా జనరల్ మేనేజర్ రాం చందర్, ఏరియా అధికారులకు టీబీజీకేఎస్ తరుఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.