Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస అఖిల భారత కౌన్సిల్ సభ్యునిగా తిరిగి మచ్చా ఎన్నిక
నవతెలంగాణ-చర్ల
వ్యవసాయ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అలుపెరుగని పోరాటాలు చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాన్ని మచ్చా వెంకటేశ్వర్లు ప్రటిష్ట పరుస్తున్నారని చర్ల మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బందెల చంటి మాట్లాడుతూ... ఈ నెల 15 నుండి 18 వరకు మూడు రోజులపాటు పశ్చిమబెంగాల్, కలకత్తా నగరంలోని హౌరాలో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పదవ ఆలిండియా మహాసభలో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్ సభ్యునిగా తిరిగి మచ్చా వెంకటేశ్వర్లును ఎన్నుకోవడం జరిగిందని వ్యకాస జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపడుతున్న మచ్చా వ్యకాస అఖిళ భారత కమిటీ సభ్యులుగా ఎన్నిక కావటం పట్ల సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, మండల కార్యదర్శి కారం నరేష్ కమిటీ సభ్యులు మచ్చా రామారావు, పొడుపు గంటి సమ్మక్క, రాంపండు, వెంకటేశ్వర్లు, వ్యకాస అధ్యక్షులు సరోని, మండల కమిటీ సభ్యులు దొడ్డి హరి నాగవర్మ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయ కార్మిక సమస్యలు కూలి, భూమి, ఉపాధి, పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు రూపకల్పన చేయటంలో మచ్చా దిట్ట అని, వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న మచ్చా తిరిగి మళ్లీ వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యునిగాఎన్నిక కావడంతో జిల్లాలో ఉద్యమానికి మరింత ఉత్తేజం వస్తుందని వ్యకాస సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.