Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 2నుంచి 4వరకు పాదయాత్ర
- న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు
నవతెలంగాణ-ఇల్లందు
మంత్రి సత్యవతి రాధోడ్, ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు అన్నారు. న్యూడెమోక్రసీ కార్యాలయంలో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. రెవిన్యూ డివిజన్, కొమరారం, బోడు మండలాలకై న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మార్చి 2నుండి 4 వరకూ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, స్పందించకుంటే తిరుగుబాటు తప్పదనే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్చి 2న మర్రిగూడెంలో ప్రారంభమై పోలారం చేరుకొని పోలారంలో మినీ సభ జరిపి, అక్కడినుంచి 3న పోచారంకు పాదయాత్ర బృందం చేరుకుంటుందని తెలిపారు. 3న మరొక బృందం మాణిక్యారం నుండి కొమరారం చేరుకుంటుందని తెలిపారు. కొమరారంలో మినీ సభ నిర్వహించి 4వ తేదీన ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు చేరుకుని స్థానిక శాసన సభ్యురాలుకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కొమరారం మండలం ఏర్పటు కోసం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మొదటి దశ ఉద్యమం చేశామని, రెండో దశ ఉద్యమాన్ని పాదయాత్ర ద్వారా చేపడుతున్నట్లు ప్రజలు తమ మద్దత్తుని తెలుపుతూ పాదయాత్రలో భాగస్వమ్యం కావాలని అన్నారు. పాదయాత్ర విజయవంతం కై గ్రామ, గ్రామాన గ్రూప్ మీటింగ్లు, బైక్ ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వాంకుడోత్ మోతిలాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, పట్టణ కార్యదర్శి కొక్కు సారంగపాణి, నాయకులు మాంగ్య, పూనం కోటయ్య, జోగ కృష్ణ, సర్పంచులు మోకాళ్ళ కృష్ణ, బానోతు సంతు, శీను, రాజు, ఇరప విజరు, ఇరప పొట్టయ్య తదితరులు పాల్గొన్నారు.