Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొమరం దామోదర్‌రావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అధికారులు రైతుల నుండి బలవంతంగా చేపడుతున్న భూ సేకరణను ఆపి వేయాలని దుమ్ముగూడెం, చర్ల మండలాల సీతమ్మ సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు అద్యక్షులు కొమరం దామోదర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీతానగరం గ్రామంలో జరిగిన భూ నిర్వాసితుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పేరుతో భూ సేకరణ పేరుతో రైతులకు అతి తక్కువగా నష్ట పరిహారం చెల్లించి పనులు సాగించడంతో పాటు అదనంగా ఎక్కువ భూమిని సేకరిస్తూ కనీసం రైతులకు కూడా సమాచారం ఇవ్వడం లేదన్నారు. హద్దులు, జెండాలు పాతి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అదనపు భూముల సేకరణ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వాగె ఖాదర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు సున్నం వెంకటి, వెట్టి సీతయ్య, పొడియం బొజ్జి, పూనెం భూపతి, తుష్టి కామరాజు, వాగె రాజు, నర్సింహారావు, శ్రీనివాస్, చిన్నయ్య, మహాలకీë, గోపమ్మ, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.