Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహా అన్నదానం
- అధికారుల చిన్నచూపుతో శిధిలావస్థకు చేరుతున్న దేవాలయం
నవతెలంగాణ-చండ్రుగొండ
హరినామ స్వరంతో అటవీ ప్రాంతం మారు మోగిపోయింది. పల్లేరు వీరభద్ర స్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటికీటలడాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని మండలంలోని బెండలపాడు గ్రామ శివారు అటవీ ప్రాంతం కనకాద్రి గుట్టల్లో కాకతీయ సామ్రాజ్యపు రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన అతి పురాతనమైన శ్రీ పల్లేరు వీరభద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని వంశపార్యపరంగా పూజలు నిర్వహిస్తున్న పురోహితులు విప్పర్ల వెంకట రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయం అడవి మార్గంలో గుట్టల ప్రాంతాల్లో ఉండటంతో ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి భక్తులను కొండపైకి చేరుస్తున్నారు. కొంతమంది భక్తులు కాలినడకన 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సబ్ ఇన్స్ స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి, బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులందరికీ కొండపైనే భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ దేవాలయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చతిస్గడ్, ఒరిస్సా, రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 12 గంటలకు నిర్వహించే స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దేవాలయానికి ప్రభుత్వ అధికారులు చిన్న చూపు చూడడంతో శిధిలావస్థకు చేరుకుంటుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు, పురావస్తు శాఖ అధికారులు, ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులకు సౌకర్యార్థంగా రవాణా మార్గం, విద్యుత్ సౌకర్యం, ఏర్పాటు చేస్తే దేవాలయానికి పూర్వవైభవం, కాకతీయుల కోటను సంరక్షించుకోవచ్చని భక్తులు వేడుకుంటున్నారు. స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బీిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు మాలోత్ బోజ్యా నాయక్, వైస్ ఎంపీపీ నరుకుళ్ళ సత్యనారాయణ, గానుగుపాడు సహకార సంఘం సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు, ఫెర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులు నన్నక సంపత్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కొదుమూరి దయాకర్ కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు, అంతటి రామకృష్ణ, ఆలయ కమిటీ బాధ్యులు బొర్రా సురేష్, హౌటల్ నాగా, జర్నలిస్ట్ రహీం, ఉన్నారు.