Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని ముష్టిబండ-వడ్లగుడెం గ్రామాల్లో వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ.1 కోటి నిధులు మంజూరు చేయించి, శనివారం స్థానిక ప్రజా ప్రతినిదులుతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగ్వేశరరావు శంఖుస్థాపన చేశారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సేవా చేయడానికే ఆ భగవంతుడు మనకు పదవులు ఇచ్చాడని ఈ రోజు మన దేవాలయానికి కోటి నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంఖుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, ఎంపీటీసీ రావు రమాదేవి, దారా యుగుందర్, కూకలకుంట రవి, సర్పంచ్ తిరుపతి రావు, ఉప సర్పంచ్ కూకలకుంట మాధవ రావు, జోనెబోయేన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.