Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
ఫిబ్రవరి 15-18 వరకు మూడు రోజులుగా పశ్చిమబెంగాల్, కలకత్తా నగరంలోని హౌరాలో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా మహాసభలో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్ సభ్యునిగా తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిళ భారత కమిటీ సభ్యులుగా మచ్చా వెంకటేశ్వర్లు ఎన్నిక పట్ల ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి హర్షం వ్యక్తం చేశారు. వ్యకాస జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మచ్చా వెంకటేశ్వర్లు అఖిలభారత స్థాయిలో కమిటీలోకి ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు. జిల్లాలో వ్యవసాయ కార్మిక సమస్యలు కూలి, భూమి, ఉపాధి, పోడు మొదలగు సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు రూపకల్పన చేయటంలో ముందు ఉంటూ కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న మచ్చా ఎన్నిక జిల్లా ఉద్యమానికి గర్వ కారణమని అన్నారు.