Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతి వాటం ప్రదర్శించిన ఉపసర్పంచ్
- తేట తెల్లమైనా....చర్యలు శూన్యం
- అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు
- అవినీతిపై ప్రజా పోరాటం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కొత్తగూడెం
నిధులులేక కొన్ని పంచాయతీలు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి కనిపిస్తుంది...కొన్ని చోట్లు నిధులు ఎక్కువై అవినీతికి పాల్పడుతుంటారు....ఇలాంటి పరిస్థితే పంచాయతీలో కోటిన్నర మేర అవినీతికి పాల్పడిన తీరు వెలుగులోకి వచ్చింది. సమాచార హక్కు చట్టంతో సేకరించిన ఆధారాలతో అవినీతికి పాల్పడినట్లు తేలింది...కానీ, అధికారులు మాత్రం అవినీతి పరులపై ఎలాంటి చర్యలకు ముందుకు రావడంలేదు...దీంతో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు సీపీఐ(ంఎ) పోరాటానికి సిద్దంమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని, శ్రీనగర్ గ్రామపంచాయతీలో అనేక రూపాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపనులు వున్నాయి. ఏఏ విభాగాల్లో, ఎవరు అవినీతికి పాల్పడ్డారో ఆధారాలు సేకరించి, జిల్లా కలెక్టర్ ముందు ఉంచినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. శ్రీనగర్గ్రామ పంచాయతీ అనినప్పటికీ ఇక్కడ ఎక్కువగా చదువుకున్నటువంటి మిడిల్ క్లాస్, ఏబో మిడిల్ క్లాస్, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, ఇరత సామాన్య ప్రజానీకం ఎక్కువగా ఉంటారు. నిత్యం ఎవరి పనుల్లో వారుంటారు. ఎవరు కూడా ఈ పంచాయతీ పైన దృష్టి పెట్టరు. దీన్ని అదునుగా భావించిన ఉపసర్పంచర్ రమేష్, గతంలో పనిచేసిన కార్యదర్శి ఇద్దరు కలిసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపనలు ఉన్నాయి. చేయని అభివృద్ధి పనులకు నిధులు మింగేశారని, తక్కువ ఖర్చుతో చేసిన పనులకు ఎక్కువ మొత్తంలో నిధులు వారి సొంత కుటుంబ సభ్యుల పేరుతో చెక్కులు డ్రా చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రజకు సేవలందించేందుకు ఎన్నికైన పాలకవర్గంలో సర్పంచ్‌గా ఉన్నటువంటి ఆదివాసీ వ్యక్తిని డమ్మిచేసీ, అగ్రకులానికి చెందిన ఉప సర్పంచ్ కీలకంగా చక్రం తిప్పుతున్నాడని, పెద్ద ఎత్తున నిధులు కాజేశాడని జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేరాయి. గతంలో వేసిన పాత రోడ్లకి చిన్నచిన్న మరమత్తులు చేసి కొత్తగా రోడ్డువేసి నట్లు నిధులు కాజేశారని, అదేవిధంగా పంచాయతీ పరిధిలో పనిచేసిన కార్మికుల సంఖ్యను కూడా ఎక్కువగా చూపించి, తక్కువ మంది కార్మికులతో పనిచే యించి, బిల్లులు మాత్రం ఉపసర్పంచ్ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి పేర్ల మీద కాజేశారని తెలుస్తుంది. వీటితో పాటు మరికొన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఏ) ద్వారా వచ్చి నట్లు వంటి సమాచారం మేరకు సుమారు రూ.1కోటి 59 లక్షలు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. వీటితో పాటు 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులు, ఎమ్మెల్యే, ఎంపి, ఇతర సీఎస్ఆర్, ఇతర నిధులలో అవినీతి జరిగిందని పెద్దఎత్తున ఆరోపనలు ఉన్నా యి. వీటికి సంబంధించిన ఆధారాలు రాష్ట్ర పంచాయతీ కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు, జిల్లా పంచాయతీ అధికారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించడంలేదని పెద్దఎత్తున ఆరోపనలు ఉన్నాయి.
చర్యలు తీసుకునే వరకూ పోరాటాం
కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి, మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీలో వెలుగు చూసిన అవినీతి, అక్రమాలపై అవినీతికి పాల్పడిన వారిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే వరకు పోరాటం సాగిస్తాం. జిల్లా ఉన్నతాధికా రులుకు అనేక మార్లు ఫిర్యా దు చేశామని, అవినీతికి సంబంధించిన ఆధార పత్రాలు ఇచ్చామన్నారు. అవినీతి పరులపై చర్యలు తీసుకు నేందుకు ఎందుకు ఉదాసీనత అవలంభిస్తున్నారని ప్రశ్నిం చారు. ఈ విషయంలో చర్యలు తీసుకోని పక్షంలో ఇరత పంచాయతీలలో ఇదే తరహాలో అవినీతికి పాల్పడే అవకా శాలు ఉంటాయని సూచించారు. ఇప్పటికే శ్రీనగర్ పం చాయతీలో నెలకొన్న అవినీతిపై కరపత్రాలు విడుదల చేసినట్లు తెలిపారు. వెంటనే అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఉపేక్షించే ప్రయత్నాలు జరిగితే సహించేదిలేదని, ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ