Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రముఖ నటుడు, నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న అకాల మరణం పట్ల కొత్తగూడెం నియోజకవర్గం టీడీపీ నాయకులు నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత నెల ఆంధ్రప్రదేష్లో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత 23 రోజులుగా చికిత్సపొందుతూ శనివారం మృతి చెందాడు. ఆయన అకార మరణం పట్ల కొత్తగూడెం నియోజకవర్గం టీడీపీ నేతలు ఆదివారం జరిగిన నివాళి కార్యక్రమంలో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కొత్తగూడెం ఇన్చార్జీ, రాష్ట్ర రైతు సంఘం నాయకులు కాపా కృష్ణమోహన్, టీడీపీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ కనుకుంట్ల కుమార్, కొత్తగూడెం మండల అధ్యక్షులు కొండ స్వామి, చుంచుపల్లి మండల అధ్యక్షులు మన్నెపల్లి కోటయ్య, సుజాతనగర్ మండల అధ్యక్షులు సురేష్, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు శివ, పాల్వంచ మండల అధ్యక్షులు లక్ష్మీపతి, వడ్లమూడి పూర్ణచందర్రావు, ఆనంద్, నాని, వాసం రామకృష్ణదొర తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : తారకరత్న మృతి పట్ల టీడీపీ మండల కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం మండలంలోని సారపాకలో తారకరత్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగా రావు మాట్లాడుతూ తారకరత్న లేని లోటు అటు సినీ రంగానికి, ఇటు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆయన అన్నారు. అదేవిధంగా ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎన్టీయూసీ అధ్యక్షులు కనక మేడల హరిప్రసాద్ మాట్లాడుతూ... తెలుగుదేశం కుటుంబం ఒక సభ్యుని కోల్పోయిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు జగదీశ్వ రరావు, కాకర్ల సత్యనారాయణ, గల్లా నాగ భూషయ్య, ఆకుల పద్మ, రాయనీ రాము, అంతటి గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : నందమూరి తారకరత్న మృతి బాధాకరమని సీనియర్ నాయకులు ముద్రగడ వంశీ, పాలమూల బాలకృష్ణ, విద్యార్థి సంఘ నాయకులు చాందావత్ రమేష్ బాబులు అన్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుండి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మణుగూరు : నందమూరి తారకరత్న మృతి పట్ల అంబేద్కర్ సెంటర్లో నందమూరి సేవా సమితి, సభ్యలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆధ్వర్యంలో చిత్రపటానికి నివాళి అర్పించారు. వాసిరెడ్డి చలపతిరావు, చెన్నకేశవులు, నామ వెంకటేశ్వరరావు, మల్లేడి లోకేష్, దొడ్డపెనేని రాంగోపాల్, పాలవాయి సుధాకర్, వేముల లక్ష్మయ్య, పూర్ణచంద్రరావు, చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : నందమూరి నట వారసుడు తారకరత్న మృతి పట్ల తెలంగాణ నాటక రంగ సంస్థల సమాఖ్య జిల్లా సంముక్త కార్యదర్శి కొమరం దామోదర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. గుండె పోటుతో మరణించడం భాధాకరం అన్నారు. సంతాపం తెలిపిన వారిలో పిలకా నాగేంద్రరెడ్డి, ముక్కెర రాంబాబు, ఆకుల కృష్ణార్జునరావు, రామారావు, ముక్కెర శ్రీనివాస్, యగ్గడి ప్రభాకర్, గోసంగి కిరణ్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
దమ్మపేట : నందమూరి తారకరత్న మృతికి దమ్మపేట నందమూరి అభిమానులు స్థానిక ఎన్టీఆర్ బొమ్మ వద్ద ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటనికి పూలమాలలు వేసి మౌనం పాటించి, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు భోగిం సత్యం, పానుగంటి మణికంఠ, పిట్టల లాలుప్రసాద్, మౌలానా, భార్గవ్, లక్కీ, సురేంద్ర, గోపి, వేణు, చిరు తదితరులు పాల్గొన్నారు.