Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తారక రత్న మృతి చెందాడన్న వార్త తెలిసిన పర్ణశాల గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. 2007లో తీసిన తారక రత్న సినిమా భద్రాద్రి రాము డు షూటింగ్ సుమారు 10 రోజుల పాటు పర్ణశాలలో జరిగింది. సినిమాలో కొన్ని ప్రదాన పాత్రలు ఉండే సన్నివేశాలతో పాటు సీతాకోక చిలకమ్మా లేలేత సొగసమ్మా అనే పాటను పర్ణశాలలో చిత్రీకరించారు. ఆ సమయంలో తారక రత్న గ్రామస్తులతో మమేకం అయి ఉండే వారు. షూటింగ్ విరామం సమయంలో గ్రామస్తులతో పాటు చట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వారితో చిరాకు పడకుండా వారితో కలసి ఫోటోలు దిగే వారు. తారక రత్న మృతి చెందాడన్న వార్త తెలియడంతో గ్రామస్తులతో పాటు ఆయన షూటింగ్ పది రోజుల పాటు దగ్గర ఉండి చూసిన వారు ఆయనతో కలసి ఫోటోలు దిగిన వారు సైతం మిస్ యూ తారకరత్న అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు సైతం వైరల్ చేశారు. భద్రాద్రి రాముడు షూటింగ్ మొత్తం భద్రాచలం ప్రాంతంలో తీయడంతో తారక రత్న మృతి చెందాడన్న చేదు నిజాన్ని నందమూరి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారనే చెప్పవచ్చు.