Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-పాల్వంచ
కుమ్మరి కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి ఆత్మీయ సమ్మేళనం స్థానిక వర్తక సంఘ భవనంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు బానిస శంకర్రావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వనమా మాట్లాడుతూ... కులాల ప్రాతిపదిన కళాకారులకు సంఘాలకు చేయూత ఇవ్వడమే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. సంఘ భవన నిర్మాణంలో కావలసిన స్థల కేటాయింపు సంబంధించి సంబంధిత అధికారులకు స్థల కేటాయింపు జరిగేలా చూస్తానన్నారు. అనంతరం వనమా వెంకటేశ్వరరావును సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి, రాష్ట్ర అధ్యక్షులు నడికుడి జయంతి రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్, కోశాధికారి ఏ.రాజలింగం నాయకులు ఆమెడ రేణుక, ఉపేంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.