Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఇల్లందు
రాజీవ్ నగర్ గుడిసె వాసులకు తాగునీరు ఇవ్వాలని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్ఓటూజీఎమ్కు సీపీఐ(ఎం) వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ...మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ రాజీవ్ నగర్ తండా శివారు ప్రాంతంలో గత మూడేళ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని వారికి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజీవ్ నగర్ తండా గుడిసెలు వేసుకున్న ప్రాంతం పక్కనే సింగరేణి ఫిల్టర్ బెడ్ ద్వారా మున్సిపాలిటీ డంపు యార్డుకు నీరు సరఫరా చేస్తున్నారని కూత రేటు దూరంలో ఉన్న గుడిసె వాసులకు తాగునీరు లేక అలమటిస్తున్నారని అన్నారు. సింగరేణి యాజమాన్యం కొత్త ఓసి తీసే దాంట్లో భూములు పోతున్నటువంటి రైతులు కూడా ఇక్కడ నివాస ఉంటున్నారని వారికి తాగునీరు సింగరేణి ద్వారా అందించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్ కుమార్, ధారావత్ రాందాస్, పాష, హుస్సేన్, వీరభద్రం, వెంకన్న ఖాదర్, ఖాజా, రజియా, ఖైరున్, గోబ్రియా, ప్రసాద్, హేమ్లీ, పద్మ, కుమార్, కౌసల్య, అమ్మి, మహేశ్వరి, కుమార్, నర్సయ్య, విజయ, సరిత, తదితరులు పాల్గొన్నారు.