Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మున్సిపల్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతరావు తెలిపారు. ఆదివారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీ రూపురేఖలు ఉన్నాయని అన్నారు. ప్రతి వార్డులోని అంతర్గత రోడ్లు, డ్రైనేజ్‌లు నిర్మిస్తామన్నారు. నిర్మాణాలతో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. మణుగూరు మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఏ.ఈ సత్యనారాయణ, కోటేశ్వరరావు, జడ్పీటీసీ పోశం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.