Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు తెలుసుకునేందుకు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే హరిప్రియ, చైర్మెన్ డివి
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని అందుకే మున్సిపాలిటీలో సమస్యలు తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్టు ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఆదివారం పర్యటించారు. ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. మరి కొందరు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మున్సిపాలిటీకి 25 కోట్లు మంజూరు చేశారని వార్డుకు 50 లక్షలు చొప్పున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈనాడు ఇంటికి ఒకటి చొప్పున మంజూరయ్యాయని అన్నారు. ఇంకా పథకాలు అందనివారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హర్సింగ్, కౌన్సిలర్లు వార రవి, కటకం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.