Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర సలహాదారులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని గొర్రెల, మేకల పెంపక దారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కాసాని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కొండబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మునుగోడు నియోజకవర్గంలో 7600 మంది గొల్ల కురుమలకు బ్యాంకు ఎకౌంట్లో నగదు జమ చేసి మూడు నెలలు దాటినా నగదు డ్రా చేయలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మంత్రి తలసాన శ్రీనివాస్ యాదవ్ మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్ల కురుమల అందరికీ గొర్రెల బదులు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా సెక్రటరీ బచ్చలకూర శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు లింగన్న, బచ్చలకూర అశోక్, ఉదారి మల్లయ్య, జంగిలి వెంకటరత్నం, గాలి రామారావు, కళింగి హరికృష్ణ, కర్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.