Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
జిల్లా జాతీయ బీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులుగా కె.శంకర్ నియమితుల య్యారు. ఈ మేరకు ఆదివారం జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్.కృష్ణయ్య చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ బిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని అన్నివిధాలా అండగా ఉంటానని చెప్పారు. నన్ను నమ్మి ఈ పదవి అప్పగించిన జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు, బిసి కమిషన్ చైర్మెన్ డాక్టర్ వఖులాభరణం ధన్యవాదాలు తెలియజేశారు.