Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ భర్త గణేష్ మరికొందరిపై చర్యలకు వెనుకాడం
- ప్రలోభాలకు గురికాకుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్‌లు ఎందుకు పెట్టారు
- ఆంధ్రలో అజ్ఞాతం వీడి కౌన్సిలర్లు ప్రజాక్షేత్రంలోకి వచ్చి సమస్యలపై పోరాడాలి
- తప్పులుంటే చైర్మన్, వైఎస్ చైర్మన్ పైన చర్యలు తీసుకుంటాం
- తాత మధుపై విమర్శలను ఖండిస్తున్నాం
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మన్ కోరంలు బీఆర్ఎస్ పార్టీ పై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే హరిప్రియ ఆరోపించారు. కొందరు కౌన్సిలర్లు ఆంధ్రలో అజ్ఞాతం వీడి ప్రజాక్షేత్రంలోకి రావాలని పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో చైర్మెన్, వైస్ చైర్మన్, మరో ఏడుగురు కౌన్సిలర్లు, ముఖ్య నేతలతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 15 రోజుల నుంచి ఇప్పటివరకూ కౌన్సిలర్లు అజ్ఞాతంలో ఉండి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడుతున్నారని ప్రలోభాలకు గురికాకుంటే ఎందుకు స్విచ్ ఆఫ్‌లో పెడుతున్నారని అన్నారు. కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మాన పత్రం ఇవ్వడం, పక్క రాష్ట్రాల్లో ఉండడం ఎవరికోసం కొట్లాడుతున్నారని అన్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంవల్ల మాట్లాడే పరిస్థితి లేక విలేకరుల సమావేశంలో పిలుపునిస్తున్నామన్నారు. తాను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు, ఇతర కార్యక్రమాలలో ఉన్న సమయంలోనే వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. కౌన్సిలర్ భర్త మద్యం సిండికేట్ గణేష్ మున్సిపల్ చైర్మన్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్ల కేసు పెట్టారని అన్నారు. ముగ్గురు కౌన్సిలర్లు మిగతా వారిని ఒత్తిడి చేసి ప్రలోభాలకు గురిచేస్తూ మిగతా వారిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లారని అన్నారు. వారంతా అమాయకులే అన్నారు. వారి ఫోన్లను గణేష్ దగ్గరే ఉంచుకొని స్విచ్ ఆఫ్పెట్టారేమోనని అన్నారు. పార్టీ మనుగడకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకడమన్నారు.
ఎమ్మెల్యే మాట వింటాం అంటూనే
అవిశ్వాసం అనడం సరి కాదు
అజ్ఞాతంలో ఉన్న కౌన్సిలర్లు మా నాయకురాలు ఎమ్మెల్యే నే మాట శిరోధార్యం వారితోనే ఉంటాం అంటూనే మళ్లీ అవిశ్వాసం కావాలనడం సరికాదన్నారు. అజ్ఞాతంలో ఉంటూ వీడియోల ద్వారా వాయిస్ పంపించడం సరికాదన్నారు. నిర్బంధం వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నిర్భయంగా మాట్లాడాలన్నారు. వెనుక ఉన్న శక్తులకు లొంగవద్దన్నారు. ఒకరి స్వార్థం కోసం దోషులుగా నిలబడవద్దన్నారు. తప్పులుంటే చైర్మన్, వైఎస్ చైర్మన్ పైన చర్యలు తీసుకుంటామన్నారు.
నియోజకవర్గాన్ని రూ.కోట్లతో అభివృద్ధి చేశా
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ సహకారంతో కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. దశాబ్దాలుగా ప్రజలు కలలుగన్న బస్ డిపో నిర్మాణం, కూరగాయల మార్కెట్, ట్యాంక్ బండ్, మెయిన్ రోడ్డు సులబ్ కాంప్లెక్స్‌లు ఎన్నింటినో చేశామన్నారు. పాలకవర్గం సహకారంతో దేశంలో 18, రాష్ట్రంలో మొదటి స్థానంలో మున్సిపాలిటీని నిలిపామన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ జిల్లా పరిటాల సందర్భంగా అభివృద్ధిని చూసి మరో 25 కోట్లు మంజూరు చేశారన్నారు. వార్డుకు 50 లక్షల చొప్పున అభివృద్ధి జరగనుందని తెలిపారు. 24 వార్డుల్లో తానే స్వయంగా తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. అజ్ఞాతను వీడి కౌన్సిలర్లు అంతా వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కౌన్సిలర్ గెలుపులో మంత్రి అజరు, తాతా మధు కృషి
తాత మధుపై విమర్శలను ఖండిస్తున్నాం
గృహిణులుగా ఉన్నవారిని ప్రోత్సహించి బి ఫాం ఇచ్చి కౌన్సిలర్లుగా గెలిపించామన్నారు. వారి గెలుపులో మంత్రి అజరు, ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు ఈ ఊరు కాదని ఈ జిల్లాకు నాయకుడు కాదని మరికొన్ని విమర్శలు అజ్ఞాతంలో ఉన్న కౌన్సిలర్లు చేయడం ఖండిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఏ రకమైన ఎన్నికలు ఉన్నా అభ్యర్థులను నాయకులను సమన్వయం చేసి గెలుపులో భాగస్వాములు అయ్యారని అన్నారు.
తప్పులుంటే నాపై చర్యలు తీసుకోండి : చైర్మెన్ డివి
మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తప్పులుంటే నాపై చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదని, అవినీతికి పాల్పడలేదన్నారు. కౌన్సిలర్ భర్త గణేష్ వాట్సాప్‌లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ మానసిక సంక్షేమానికి గురి చేయటం వల్ల కేసు పెట్టామన్నారు.
దురుద్దేశాలు సరికాదు : ఎమ్మెల్యేనే సుప్రీం
గ్రంథాలయ చైర్మెన్ దిండిగాల, నేతలు
పులిగవెళ్ళ, రంగనాథ్
కొంతమంది వ్యక్తుల దురుద్దేశాలు సరికాదని నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్పీ అనే సుప్రీమ్మని గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర నేత పులిగల్ల మాధవరావు, టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షులు రంగనాధ్ అన్నారు. బలమైన శక్తులు వెనుక ఉండటం వల్లే ఈ విధంగా జరుగుతోందన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక కొందరు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. కలిసి పని చేసుకుందాం రావాలని అజ్ఞాత కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు.