Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వామివారి కల్యాణం తిలకించిన భక్త జనం
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం పరిధిలోని మోతే గ్రామపంచాయతీలో గల గోదావరి ద్వీపకల్పంలో ఉన్న మోతేగడ్డ వీరభద్ర స్వామి వారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని శనివారం అర్ధరాత్రి సమయంలో స్వామి వారి కల్యాణ కత్రువు వేద పండితుల మంత్రోచ్ఛాలు, భక్త జన సందోహాల నడుమ వైభవంగా జరిగింది.
ఈ కల్యాణ మహౌత్సవాన్ని కనులారా వీక్షించేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్గడ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన భక్తులు కల్యాణ మహౌత్సవ వేడుకలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణ మహౌత్సవాన్ని తిలకించేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన భక్తులు గోదావరి నదిని పడవల ద్వారా బోటుల ద్వారా దాటి స్వామివారిని దర్శించుకున్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన స్వామివారి కల్యాణ మహౌత్సవాన్ని కనులారా భక్తులు తిలక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ, గ్రామపంచాయతీ అధికార యంత్రాంగ బృందం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ఐ పి.సంతోష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్వామి వారి ఆదాయం రూ.12,63,328
మోతేగడ్డ వీరభద్ర స్వామి కల్యాణ మహౌత్సవానికి ఏడాది ఆదాయం రూ.12,63,328లు వచ్చింది. ఈ మేరకు ఆదివారం ఆదాయాన్ని దేవాదాయ వివిధ శాఖల అధికారుల సమక్షంలో లెక్కించారు. గత ఏడాది రూ.10,17,873 లక్షల ఆదాయం సమకూరింది. అయితే గత ఏడాది కంటే సుమారు రెండు లక్షల ఆదాయం ఈ ఏడాది పెరిగింది. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వల్లూరిపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు ఎస్ఐ పి.సంతోష్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.