Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7434 మందికి పరీక్షలు అ 1773 మందికి కండ్లద్దాలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 19 నుండి జూన్ 02వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట (వినాయకపురం), గుమ్మడవల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రుల పరిధిలో మొత్తం 26587 జనాభాకు గాను 14714 మందిని లబ్ధిదారులగా నిర్ధారించారు. వీరిని పరీక్షించడానికి అశ్వారావుపేట పంచాయతీ పరిధిలో రైతు శిక్షణా కేంద్రంలో, పేరాయిగూడెం పంచాయతీ రైతు వేదికలో, గుమ్మడవల్లి పి.హెచ్.సిలో మొత్తం 03 కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు 7434 మందిని పరీక్షించి 1773 మందికి దగ్గరి చూపు అద్దాలు (చదివే అద్దాలు) అందజేసారు. 757 మందికి దూరపు చూపు అద్దాలు (రాసే అద్దాలు) సరఫరా కోసం నమోదు చేసారు. వీటిని త్వరలో పంపిణీ చేయనున్నట్లు అశ్వారావుపేట, గుమ్మడవల్లి వైద్యాధికారులు డాక్టర్ రాందాస్, డాక్టర్ మధుళికలు తెలిపారు. ఈ కంటి వెలుగు కేంద్రాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లాంచనంగా ప్రారంభించగా ఆర్డీఓ స్వర్ణలత, డీఎం అండ్ హెచ్ఓ శిరీషలు పరిశీలించారు.