Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాలపై పోరాడుతూ హక్కులు, చట్టాలు పరిరక్షణకై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు భద్రాచలంలో నిర్వహిస్తున్నామని ఈ మహాసభల జయప్రదంకు కృషి చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు పిలుపునిచ్చారు. భద్రాచలంలో ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు వజ్జా సురేష్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంను ఉద్దేశించి అయన మాట్లాడుతూ ఆదివాసీల పైన ఇప్పటి వరకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక పరమైనా దాడి జరిగిందని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంస్కృతిక పరమైన దాడి జరుగుతుందని అన్నారు. ఆదివాసీ నివసించే ప్రాంతం నుండి చేసే వ్యవసాయం నుండి గెంటి వేయబడుతున్నాడని అడవి నుండి బయటకు గెంటి వేయడం కోసం పాలకులు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగమే అటవీ సంరక్షణ నియామవలి చట్టం తీసుకావస్తున్నారని అన్నారు. జిల్లాలో గొత్తి కోయలపట్ల రాష్ట్ర ప్రభుత్వం అధికా రులు వివక్షత చూపుతున్నారని వారిని కూడా ఆదివాసీలుగానే గుర్తించలని వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే సర్వే చేసిన పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా హక్కు పత్రాలు ఇవ్వాలని నెలలు గడుస్తున్నా హక్కు పత్రాలు ఇవ్వడం లేదని అన్నారు. ఏప్రిల్ చివరి వారంలో సంఘం రాష్ట్ర మహాసభలు భద్రాచలంలో జరుగుతున్నాయని మహాసభల జయప్రదం కోసం విస్కృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వజ్జా సురేష్, సరియం కోటేశ్వరరావు, జిల్లా నాయకులు కుంజా శ్రీను, గౌరీ నాగేశ్వరావు, మడివి రమేష్, దుబ్బ గోవర్ధన్, తొడం తిరుపతి, పాయం నర్సింహారావు, గౌరీ,చర్ప సత్యం, తోలేం జ్యోతిక, కొడెం బోస్, నానరావు తదితరులు పాల్గొన్నారు.