Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి, త్రివేణి కిడ్స్ పాఠశాలలో 'సైన్స్ ఎక్స్ పో'ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో సైన్సుకు సంబంధించిన జీవవైవిద్యము, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యనివారణ. విద్యుత్ శక్తి, సౌరశక్తి, లావా ల్యాంప్, సమతుల్య ఆహారం, స్వచ్ భారత్, మ్యాగెటిసమ్ తదితర నమూనాలను విద్యార్థులు చూపించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా లఘునాటికలు, బుర్రకథలు ప్రదర్శించి అందరిని అబ్బురపరిచారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సయ్యద్ శహనాజ్ మాట్లాడుతూ సైన్స్ ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరించారు. త్రివేణి పాఠశాలల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్, మాట్లాడుతూ ఈ విధంగా వివిధ నమూనాల రూపంలో సైన్స్ ప్రాముఖ్యతను వివరించినందుకు విద్యార్థులను అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో విజేతలయిన విద్యార్థిని, విద్యార్థులకు సర్టిఫికెట్స్, మిఠాయిలను అందజేసారు. ఈ క్యాక్రమంలో సి.ఆర్.ఓ.మురళీకృష్ణ, ప్రిన్సిపల్స్ సురేష్, శ్రీనివాస్ సింగ్, కిడ్స్ ఉపప్రధానోపాథ్యాయిని సౌజన్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.