Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి
- కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తాం
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార స్వభావాన్ని పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యలను విని దరఖాస్తుల స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలలో చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. పాల్వంచలోనే చింతలచెరువు టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు కార్యచరణ సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చింతలచెరువు బ్యూటిఫుల్ పిక్నిక్ స్పాట్ కావాలని, పాల్వంచకు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తయారు చేయుటకు ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ప్రజావాణిలో పాల్వంచ మండలం రంగాపురం గ్రామం పంచాయతీకి చెందిన బానోతు బొజ్జ రంగాపురం రెవిన్యూలో సర్వేనెంబర్ 3/1లో 4 ఎకరాల భూమి ఉందని ఆసప్తంగా అట్టి భూమిని తన కుమారుడు బానోత్ వాళ్ళ మాకు వాటాగా ఇచ్చి ఉన్నానని ఆ భూమిని తనకి పేరు మీదకు మార్చి దర్వాకుల కల్పించడంలో పాటు రైతుబంధు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడంతో చర్యలపై ధరణి కోఆర్డినేటర్‌కు ఎండాఫ్ చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన టి.నాగేశ్వరి పాల్వంచలోని కెఎల్ఆర్ కళాశాలలో ఫార్మా డీలో ఉచిత సీట్ వచ్చిందని తదుపరి జరిన కౌన్సిలింగ్లో తనకు ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో బిహెచ్ఎంఎస్లో సీటు వచ్చిందని ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని కేఎల్ఆర్లో కళాశాలలో దరఖాస్తు చేయగా రూ.1,50,000 చెల్లించాలని అడుగుతున్నారని తాను నిరుపేద కుటుంబానికి చెందిన కాబట్టి అంత ఫీజు చెల్లించే స్థితిలో లేనని కావున తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో పాల్వంచ తహసిల్దార్‌కు కలెక్టర్ సమస్య పరిష్కరించాలని తెలిపారు. తదితర సమస్యలను స్వీకరించారు. తగు చర్యలు నిమిత్తం ఆర్ఓఎఫ్ ఆర్డీటీ భద్రాచలంకు ఎండార్స్ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.