Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో అత్యవసర మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు
- అందుబాటులో ఉంచాలి
- వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు సిద్ధం చేయాలి
- ప్రధాన కూడలలో చలివేంద్రాల ఏర్పాటు చేయాలి
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వేసవిలో అండ్ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి మాసం నుండే ఎండలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆసుపత్రుల్లో అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలు ఎండ దెబ్బకు కాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మందులను ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వేసవిలో పాటించాల్సిన అంశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. మండల మేజర్ గ్రామపంచాయతీలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాలిచ్చే తల్లులు, చిన్నారుల సంరక్షణ చర్యలపై జాగ్రత్త తెలియజేయాలని సంక్షేమ అధికారికి సూచించారు. మహిళా సమఖ్యుల సమావేశాల్లో వేసవిలో ఆరోగ్య పరిరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎండలు అధికంగా ఉన్న సమయంలో ప్రజలు సాధ్యమైనంతవరకు ఇండ్ల నుండి బయటకు రాకుండా ఆహ్వాన కల్పించాలని చెప్పారు. మార్చి 1వ తేదీ నుండి ప్రధాన కూడలిలో మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు మంచినీళ్లు ట్యాంకులను పరిశుభ్రం చేపించాలని మంచినీటి పైప్లైన్ లకు లీకేజీ లేకుండా చూడాలని తక్షణమే మరమ్మత్తు నిర్వహించాలని మిషన్ భగీరథ ఈఈకి సూచించారు. వేసవిలో మంచినీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రి సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, డీఆర్ఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.