Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన ఎస్పీ వినీత్.జి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రెండు పోలీసు జాగిలాలు బంగారు, వెండి పతకాలు సాధించాయి. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జాగిలాల నిర్వహణ అధికారులను ఎస్పీ వినీత్.జి అభినందించారు. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ జాగిలాలకు గత సంవత్సరం జూన్ మాసం నుండి ఈనెల 16వ తేదీ వరకు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ నందు శిక్షణ ఇప్పించడం జరిగింది. 8 నెలల శిక్షణ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పరీక్షలలో అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన గ్రేసి బంగారు పతకాన్ని, రెండవ స్థానంలో నిలిచిన 'రీనా' కు వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాయి. జిల్లాకు కేటాయించబడిన నార్కోటిక్స్ విభాగంలో శిక్షణ పొందిన ఈ రెండు జాగిలాలు అత్యంత ప్రతిభ కనబరిచి పథకాలను గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి అన్నారు. గ్రేసీ, రీనాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు జాగిలాల సంరక్షణకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలను పాటించా లని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ డిఎస్పీ విజరు బాబు, ఆర్ఐలు దామోదర్, సోములు, ఏఆర్ ఎస్సై పెంటోజిరావు, హెడ్ కానిస్టేబుల్ నాగుల్ మీరా (రీనా హాండ్లర్), కానిస్టేబుల్ వెంకటేష్ (గ్రేసీ హాండ్లెర్) తదితరులు పాల్గొన్నారు.