Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏరియా సేవా అధ్యక్షురాలు జక్కం వాణి రమేశ్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సేవా సమితి మహిళకు అందిస్తున్న టైలరింగ్ కోర్స్‌ను చక్కగా వినియోగించు కోవాలని, శిక్షణ పొందిన మహిళలకు ఆర్ధికంగా ఎంతో చేయూత నిస్తుందని కొత్తగూడెం ఏరియా సేవా అద్యక్షురాలు జక్కం వాణి రమేశ్ తెలిపారు. సోమవారం కొత్తగూడెం సింగరేణి సేవా సమితి ఆద్వర్యములో, సత్తుపల్లి కిస్టారమ్ గ్రామం అంబేడ్కర్ నగర్లో టైలరింగ్ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భముగా వాణి రమేశ్ మాట్లాడుతూ ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యములో నిర్వహిస్తున్న టైలరింగ్ కోర్స్‌ను మహిళలు చక్కగా వినియోగించు కోవాలని, భవిష్యత్తులో కిస్టారమ్ గ్రామ మహిళలు ముందుకు వచ్చి ఎస్ఎస్ఎస్ ద్వారా మరిన్ని ట్రైనింగ్ కార్యక్రమాలైన బ్యూటీషియన్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిసైనింగ్, కంప్యూటర్ కోర్స్‌లను కూడా నేర్చుకొని లబ్ది పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమములో ఎంపిటిసి పాలకుర్తి సునీత, మొక్కపాటి వెంకటేశ్వర్లు, దుర్గా ప్రసాద్, ప్రహర్షిత విజరు సందీప్, కోమల మురలి కృష్ణ, పిట్ సెక్రెటరీ జి.మురళి కృష్ణ, సీనియర్ పి.ఓ.లు జి.సుధాకర్, విజరు సందీప్, ఎస్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ సాగర్, కమ్మునికేషన్ కో-ఆర్డినేటర్ కె.శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.