Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధాకలితో బతుకులు, సమస్య పరిష్కరించండి : సీఐటీయూ
నవతెలంగాణ-ఇల్లందు
39 నెలల పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని గత 48 రోజులుగా కార్మికులు నిరవధిక సమ్మె చేస్తూ అర్ధాకలితో బతుకులు ఈడుస్తురన్నారు. సమస్య పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు నబీ డిమాండ్ చేశారు. గత 35 రోజులుగా ఇల్లందు ఐటీడీఏ, ఏటీడీఓ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ పీఎంహెచ్ హాస్టల్ ఔట్ సోర్సింగ్ కార్మికుల శిబిరాన్ని భద్రాద్రి జిల్లా సీఐటీయూ నేత అబ్దుల్ నబీ మంగళవారం సందర్శించి మాట్లాడారు. న్యాయంగా తమకు రావాల్సిన పెండింగ్ జీతాల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడం దుర్భరం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ఆర్భాటంగా జనరంజక బడ్జెట్ అని బీరాలు పోతున్న వీరికి న్యాయంగా రావాల్సిన జీతం కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడం శోచనీయమని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మె చేస్తున్న కార్మికులకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తామని, పోరాటంలో పాల్గొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేత తాళ్లూరి కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఈసం పద్మ, కుంజ జయా, ఈసం భద్రమ్మ, ఈసం స్వరూప, తోలెమ్ సుజాత, తాటి భారతి, ముక్కటి శైలజ, బీజ్జ దీప, పాయం విజయ భారతి, హలావత్ అనిత, తదితరులు పాల్గొన్నారు.