Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండలంలోని పోట్లపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్ నందు జరుగుతున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఎంపీపీ గుమ్మడి గాంధీ సోమవారం సందర్శించారు. ఈ వైద్య శిబిరంలో మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేసి, మాట్లాడారు. మండలంలో 19వ తారీకు నుండి ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ఎంతోమందికి కంటి చూపును ప్రసాదిస్తుందన్నారు. ఇప్పటివరకు మండలంలో 22 కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం జరిగిందని 2977 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 803 కళ్ళజోళ్ళు అందజేశామని తెలియజేశారు. 746 కళ్ళజోళ్ళు అవసరం ఉన్నవారిని గుర్తించామని నెల రోజుల్లో వారికి కూడా కళ్ళజోళ్ళు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గాభవాని, డాక్టర్ దినేష్ కుమార్, నేత్ర వైద్యాధికారి సంజీవరావు, డీఈఓ జ్యోతి, ఏఎన్ఎంలు భారతి, పార్వతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.