Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
క్రీడల్లో గెలుపోటములు సహజమని వాటిని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని చింతకాని ఎస్ఐ పొదిల వెంకన్న పేర్కొన్నారు. మండల పరిధిలోని నేరేడులో మహాశివరాత్రి సందర్భంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీల్లో సోమవారం జరిగిన ఆటలను ఆయన ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 41 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆటల పోటీలో నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం బాధ్యుడు దూసరి నేతాజీ, గ్రామ ఉపసర్పంచ్ గోపాలరావు, క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు.